Site icon HashtagU Telugu

Rashmika Mandanna: ‘గీత గోవిందం’కి ఏడేళ్లు.. రష్మిక ఆస‌క్తికర పోస్ట్‌!

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: నటి రష్మికా మందన్న (Rashmika Mandanna) తాను నటించిన ‘గీత గోవిందం’ సినిమా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా సెట్స్ నుండి కొన్ని అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ఉండటం.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకు మరింత బలం చేకూర్చింది. 2018లో విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా విడుద‌లైన తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.

రష్మిక షేర్ చేసిన పోస్ట్‌లో.. సినిమా సెట్స్‌లో తీసుకున్న ఫోటోలతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో విజయ్ తన ఫోన్‌లో స్క్రోల్ చేస్తుండగా తీసిన క్యాండిడ్ స్నాప్ కూడా ఉంది. ఈ పోస్ట్‌కు రష్మిక “7 సంవత్సరాల క్రితం నుండి ఈ ఫోటోలు నా దగ్గర ఇంకా ఉన్నాయని నమ్మలేకపోతున్నాను.. గీతా గోవిందం ఎప్పటికీ ఎల్లప్పుడూ నాకు అత్యంత ప్రత్యేకమైన చిత్రం” అని క్యాప్ష‌న్ రాశారు. “ఈ సినిమా తీసిన వారందరినీ గుర్తు చేసుకుంటున్నాను. మేమందరం కలిసి చాలా కాలం అయింది. 7 సంవత్సరాలు అయిందని నమ్మలేకపోతున్నాను కానీ హ్యాపీ” అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also Read: FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు

‘గీత గోవిందం’ గురించి

‘గీత గోవిందం’ ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో విజయ్.. గోవింద్ అనే యువకుడు, స్వతంత్ర భావాలున్న గీత అనే యువతితో ప్రేమలో పడతాడు. ఒక అపార్థం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. చివరకు విజయ్ ఆమెను ఎలా గెలుచుకుంటాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా జీ5, జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Exit mobile version