Rashmika Mandanna: విజయ్ తో విహారయాత్రకు వెళ్తే తప్పేంటి?.. రష్మిక రియాక్షన్

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తన కున్న రిలేషన్ పై రష్మిక ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Vijay And Rashmika

Vijay And Rashmika

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అందం, అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. ఫుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారి, ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా కాంట్రావర్సీల్లోనూ హైలైట్ అవుతోంది. ఈ క్రమంలో కాంతార హీరో రిషబ్ శెట్టి వివాదంతో పాటు టాలీవుడ్  సాంగ్స్ లో రొమాన్స్ ఉండదనే కామెంట్స్  తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే రష్మిక (Rashmika Mandanna) ఏమాత్రం సమయం దొరికినా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో టూర్స్ కు, పార్టీలకు వెళ్తోంది. దీంతో వారిద్దరు డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కూడా బహటంగానే వినిపిస్తోంది. ఈనేపథ్యంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తన కున్న రిలేషన్ పై ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి స్పందించింది. విజయ్ దేవరకొండతో రొమాంటిక్ రిలేషన్ షిప్ (Dating) ఉందంటూ వస్తున్న వార్తలను నటి రష్మిక మందన్న ఖండించారు.

విజయ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అతనితో విహారయాత్ర (Vacation)కు వెళ్లడంలో తప్పు లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో ట్రోల్‌లను ఒక పరిమితి వరకు సహిస్తానని, అయితే హద్దులు దాటితే ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. అదే ఇంటర్వ్యూలో, రష్మిక తనకు చిన్నతనంలో కమ్యూనికేషన్ సమస్యలు ఉన్నాయని, ఇది వివాదాలకు దారితీసిందని, నెటిజన్స్ తనను అహంకారి అని తప్పుగా భావించారని పంచుకున్నారు. హాస్టల్‌లో ఉన్న రోజుల్లో తన గదిలో ఒంటరిగా ఏడ్చేదాన్ని అని రష్మిక (Rashmika Mandanna) వెల్లడించింది.

Also Read: BJP Telangana: భజన వద్దు.. బలోపేతం చేయండి!

  Last Updated: 27 Jan 2023, 01:01 PM IST