Rashmika Mandanna: సినిమా పరిశ్రమలో నేషనల్ క్రష్, ప్రజలకు పరిచమైన యువ నటి రష్మికా మందన్న (Rashmika Mandanna). ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక స్టార్‌గా మారింది. 28 సంవత్సరాల వయస్సులోనే ఈ యువ నటి తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. 2016లో కిరాక్ పార్టీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన రష్మిక.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చేసిన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
రష్మికా మందన్న .. తెలుగు సినిమా పరిశ్రమలో సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, భీష్మ, సీత రామం వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే 2021లో పుష్ప: ది రైజ్ సినిమాతో ఆమె కెరీర్‌లో అద్భుతమైన మలుపు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో జోడీగా నటించిన రష్మికా.. తెలుగు సినిమా ప్రేక్షకులను మాయచేసింది. పుష్ప: ది రూల్ చిత్రంతో ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది.
Also Read: Davos : తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు..రేవంతా మజాకా..!
హిందీ సినిమాల్లో కూడా రష్మికా తన ప్రతిభను చాటుతోంది. 2022లో గుడ్‌బై అనే చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె.. 2023లో యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌తో కలిసి నటించి మరింత గుర్తింపు పొందింది. ఈ నేషనల్ క్రష్ 2025లో మరిన్ని భారీ ప్రాజెక్టులతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. రష్మికా వ్యక్తిగతంగా కూడా ఎంతో ఆసక్తికరమైన జీవితం గడుపుతోంది. ఇటీవల ఆమె కోస్మోపాలిటన్ పత్రికతో చేసిన సంభాషణలో ఆమె తన జీవితాన్ని “సువర్ణ కాలం”గా అభివర్ణించింది. ఈ కాలంలో ఆమె అనేక విజయాలు సాధించి, తన పని, వ్యక్తిగత జీవితాన్ని సాఫీగా చేసుకుంటోంది.
“పుష్ప 2” చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత.. రష్మికా 2025లో అనేక కొత్త చిత్రాలతో మరింత విజయాలను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె తన స్వంత కృషి, పట్టుదల,, సరైన వ్యక్తిత్వం ద్వారా ఈ స్థాయికి చేరుకుంది. రాబోయే కాలంలో రష్మికా.. ప్రపంచ సినీ ప్రేక్షకుల మన్ననలు పొందడం, సినీ పరిశ్రమలో పలు జాతీయ అవార్డులు గెలుచుకోవడం ఖాయమే అంటున్నారు.