టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika ) ఇప్పుడు బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు నటిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ బ్యూటీ, తాజాగా ‘డియర్ డైరీ’ (Dear Diary)అనే పేరుతో తన సొంత పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో ద్వారా ప్రకటించగా, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘డియర్ డైరీ’ గురించి రష్మిక మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక బ్రాండ్ కాదు, ఒక పెర్ఫ్యూమ్ కాదని, తన వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా ఉన్న భావన అని తెలిపారు. ఈ సుగంధ ద్రవ్యాల ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రత్యేకతను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ ప్రయాణం ప్రారంభించానని పేర్కొన్నారు. వ్యక్తిగత అనుభవాలే ఈ బ్రాండ్‌కి ప్రేరణగా నిలిచాయని చెప్పుకొచ్చారు.
MG M9 : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!
రష్మిక ప్రారంభించిన ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ధరలు రూ.1,600 నుంచి రూ.2,600 మధ్య ఉన్నాయి. మధ్య తరగతి వర్గానికి అందుబాటులో ఉండే రేంజ్‌లో వీటిని విడుదల చేయడం గమనార్హం. ఆమె పర్సనాలిటీకి తగ్గట్లే స్టైల్, ఫ్రెష్‌నెస్, శుభ్రత కలగలిసిన అరోమాతో ఈ ఉత్పత్తులను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌కు మంచి స్పందన లభిస్తోంది.
నయనతార, సమంత వంటి హీరోయిన్లు ఇప్పటికే బ్యూటీ బ్రాండ్స్ ప్రారంభించి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా అదే మార్గాన్ని అనుసరించడం విశేషం. సినిమా రంగంలో సత్తా చాటిన ఆమె, ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి మరో కోణాన్ని చూపించారు. ఇది రష్మిక కెరీర్‌కు కొత్త మలుపు అని అభిమానులు భావిస్తున్నారు.