అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే నేషనల్ లెవెల్ లో ఈ సినిమాపై ఉన్న బజ్ తెలిసిందే. సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఐతే ఈ సినిమా కోసం రష్మిక (Rashmika Mandanna) బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వేరే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పుష్ప 2 కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించిందట. ఈ క్రమంలో సినిమాకు హైయెస్ట్ కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
పుష్ప 2 (Pushpa 2) కోసం రష్మిక 170 రోజుల దాకా డేట్స్ ఇచ్చినట్టు నిర్మాతలు వెల్లడించారు. సినిమాకు ఆమెకున్న కమిట్మెంట్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తుంది. కామన్ గా అయితే ఒక సినిమాకు 70 నుంచి 100 రోజుల డేట్స్ ఇస్తారు. కానీ పుష్ప 2 కోసం రష్మిక అదనంగా 70 రోజుల దాకా ఇచ్చిందట. హీరోయిన్ రెమ్యునరేషన్ (Remuneration) డేట్స్ వైజ్ ఉండదు సినిమాకు ఇంత అనుకుని ఎన్ని రోజులైనా షూట్ చేస్తారు.
మరో సినిమా చేసే టైం కూడా..
ఆ లెక్కన మరో సినిమా చేసే టైం కూడా పుష్ప 2 కే కేటాయించింది రష్మిక. అయినా సరే శ్రీవల్లిగా ఆడియన్స్ లో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. యానిమల్ తర్వాత రష్మిక క్రేజ్ డబుల్ కాగా పుష్ప 2 లో ఆమెది కూడా ఇంపార్టెంట్ రోల్ అని తెలిసి అమ్మడి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
పుష్ప రాజ్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో పాటు శ్రీవల్లి అందాలు కూడా సినిమాకు ప్లస్ అవుతాయని టాక్. మొత్తానికి రష్మిక రేంజ్ మరింత పెంచేలా పుష్ప 2 వస్తుందని చెప్పొచ్చు.
Also Read : Prabhas : ప్రభాస్ 7 సినిమాల లైనప్.. రచ్చ రంబోలా..!