Rashmika Mandanna- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకలో సౌత్ ఇండియన్ సంప్రదాయాల ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకుని, ఏడడుగులు వేశారు. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో పెళ్లి తర్వాత వారి సన్నిహితులు మిఠాయిలు పంచుతూ కనిపించారు. అభిమానులు రష్మిక- విజయ్ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా వారి నిరీక్షణ ఫలించింది. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ సోషల్ మీడియాలో ఎటువంటి అధికారిక పోస్ట్‌ను షేర్ చేయలేదు.
మీడియాకు మిఠాయిల పంపిణీ
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న తెలుగు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. తెలుగు సంప్రదాయం ప్రకారం ముహూర్తం ఉదయం 8 గంటలకు ఉంది. ఆ సమయంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. ఇక రెండో సంప్రదాయం అయిన ‘కొడవ’ ముహూర్తం సాయంత్రం 4 గంటలకు ఉంది. కాగా ఉదయ్‌పూర్‌లోని వివాహ వేదిక వెలుపల రష్మిక, విజయ్‌ల సన్నిహితులు మీడియాకు మిఠాయిలు పంచుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read: విద్యుత్ శాఖలో కార్మికుల వేతనం నెలకు రూ. 2 లక్షలు.. ఇంత భారీ జీతం ఎందుకు?
#TFNExclusive A 'Sweet' gesture!❣️
Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026
ఉదయం నుండే వైరల్ అయిన ఫోటోలు
ఈ రోజు ఉదయం నుండే విజయ్- రష్మిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వారి కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయం ప్రకారం అన్ని ఆచారాలను పాటించారు. వెన్యూ నుండి పూజకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో పెళ్లిలో ఉపయోగించే కొబ్బరికాయ ఫోటో కనిపించింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్- రష్మికలకు శుభాకాంక్షలు తెలపడం ప్రారంభించారు.
హల్దీ సెరిమనీ ఫోటోలు వైరల్
నిన్న రష్మిక- విజయ్‌ల హల్దీ సెరిమనీ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్- రష్మిక కూడా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అందులో హల్దీ థీమ్ కనిపించింది. అయితే వీరిద్దరూ తమ పెళ్లి లుక్‌ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ జంట 2018 నుండి డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
