Site icon HashtagU Telugu

Rashmika-Vijay: విజయ్ దేవరకొండలో నాకు నచ్చేవి నచ్చని క్వాలిటీస్ అవే : రష్మిక

Rashmika Vijay

Rashmika Vijay

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన హీరో విజయ్ దేవరకొండ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి. గీత గోవిందం సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఆ వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టి పారేస్తూ వస్తున్నారు. కానీ వారు చేసే పనులు మాత్రం ఆ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. కలిసి వెకేషన్ లోకి వెళ్లడం ఒకే విధమైన టీ షర్టులు క్యాప్ లు వంటివి ధరించడం ఇలా ఎన్నెన్నో విషయాలలో వీరిద్దరూ ఒక్కటే అని చెప్పకనే చెప్పేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join
వారిద్దరి మధ్య ఉన్నది ఏంటో తెలియదు గాని, వారి కామెంట్స్ మాత్రం ప్రేమ వార్తలకు దారి తీస్తుంటాయి. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ లోని నేహా ధుపియా పోడ్‌కాస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్సి చేసారు. విజయ్ దేవరకొండలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? నచ్చని క్వాలిటీస్ ఏంటి? అని ప్రశ్నించగా.. దీనికి రష్మిక బదులిస్తూ.. విజయ్ కూడా నాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. దీంతో మా ఇద్దరి ఆలోచనలు, చేసే పనులు ఒకేలా ఉంటాయి. ఈ విషయం విజయ్ లో నాకు బాగా ఇష్టం.

Also Read: Vijay : రజనీకాంత్ ను మించి రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్.. ఒక్కో మూవీ అన్ని కోట్లు?

ఇక నచ్చని విషయం అంటే.. వర్క్ విషయంలో విజయ్ చాలా సీరియస్ గా ఉంటాడు. ఎప్పుడు ఏదొక వర్క్ చేస్తూనే ఉంటాడు. అది నాకు నచ్చదు అని నవ్వుతూ చెప్పుకొచ్చింది రష్మిక. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ప్రేమ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. కాగా విజయ్ దేవరకొండని రష్మిక ముద్దుగా విజ్జు అని పిలుస్తాను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ అన్ని విన్న నెటిజెన్స్.. వీరిద్దరి ప్రేమకి ఇది కూడా సాక్ష్యంగా చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read; Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న తమన్నా సూపర్ హిట్ మూవీ.. అదేంటంటే?