Rashmika : ఎన్టీఆర్ తో నేషనల్ క్రష్.. కాంబో ఫిక్స్ అయినట్టేనా..?

Rashmika RRR తర్వాత గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్న తారక్ మరోపక్క హృతిక్ రోషన్

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 06:15 AM IST

Rashmika RRR తర్వాత గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్న తారక్ మరోపక్క హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ పై మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా లైన్ లో ఉంది. సలార్ 2 కన్నా ముందు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

కె.జి.ఎఫ్ రెండు భాగాలు సలార్ 1 తో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా సలార్ లో శృతి హాసన్ ని తీసుకున్నారు.

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నని ఓకే చేసినట్టు తెలుస్తుంది. తారక్ తో రష్మిక కలిసి చేసే మొదటి సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. వార్ 2లో ఎన్టీఆర్ కి జోడీ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. కానీ ప్రశాంత్ నీల్ సినిమాలో మాత్రం రష్మికని లాక్ చేశారు.

రష్మిక ఖాతాలో ఇప్పటికే చాలా క్రేజీ సినిమాలు ఉండగా ఎన్టీఆర్ సినిమాతో మరో భారీ సినిమా ఖాతలో చేరినట్టు అయ్యింది.

Also Read : Music Maestro Ilayaraja : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా.. లీగల్ నోటీస్ పై మిశ్రమ స్పందన..!