ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj ) జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’ (Chhaava). శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ , ఆయన భార్యగా రష్మిక (Rashmika Mandanna) ఈ మూవీ లో నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో మంగళవారం రష్మిక లుక్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ పై.. రష్మిక మందన్న ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. ప్రతి గొప్ప రాజు వెనుకాల.. యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జతచేశారు. ఈ లుక్ చూసిన నేషనల్ క్రష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
Davos : ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు – నారా లోకేష్
ఇప్పటి వరకు సింపుల్ గా… నవ్వుతూ అల్లరి పిల్లలా కన్పించిన రష్మిక.. ఈ లుక్ లో.. ఒక గొప్ప ఠీవీ ఆమెలో కన్పిస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు చూడని ఒక లుక్ , ప్రత్యేకమైన పాత్రలో రష్మిక కన్పించనున్నారని మూవీ మేకర్స్ వెల్లడించారు.ఈ కథ మరాఠిలో సాగనుంది. రష్మిక ఇందుకోసం మరాఠి భాష నేర్చుకున్నారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
భారత దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ తెలియనివారంటు ఉండరని చెప్పుకొవచ్చు. అలాంటి యోధుడి కుమారుడు సంభాజీ మహారాజ్. ఆయన చరిత్రలో తండ్రి తగ్గ గొప్ప బిడ్డగా పేరు, ప్రఖ్యాదులు సంపాదించుకున్నారు. హిందూ ధర్మంకోసం ఎన్నోపోరాటాలు సైతం చేశారు.. అలాంటి గొప్ప రాజు.. సంభాజీ జీవిత చరిత్ర గురించి లక్ష్మణ్ ఉటేకర్ ఎంతో చక్కగా తెరకెక్కించినట్లు బాలీవుడ్ మీడియా చెపుతుంది.