Site icon HashtagU Telugu

Rashmika : పాపం.. ‘శ్రీవల్లి’ని పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడు

Rashmika

Rashmika

పుష్ప మూవీ వల్ల రష్మిక (Rashmika) ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. నా సామీ..నా సామీ అంటూ యూత్ అంత ఆమె జపం చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు , హీరోలైతే శ్రీవల్లి కావాలంటూ వెంటపడ్డారు. బాలీవుడ్ లో రెండు సినిమాలు సైతం చేసింది. కానీ అవి పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

ముంబై లో అంబానీ ఇంట ఫంక్షన్ అంటే తారాలోకం దిగాల్సిందే. అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న హీరో ,హీరోయిన్స్ వరకు అంత వాలిపోవాల్సిందే. అలాంటి అంబానీ (Ambani) ఇంట తాజాగా వినాయక చవితి ( Ganesh Chaturthi Bash) వేడుకలు జరిగాయి. ప్ర‌తి ఏడాది జ‌రిగిన‌ట్టే ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఈ వేడుక‌ల‌ని నిర్వ‌హించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ తారల తో పాటు కోలీవుడ్ తారలు సైతం హాజరయ్యారు.

వీరితో పాటు సౌత్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న కూడా పాల్గొంది. ట్రెడిష‌న‌ల్ లుక్ లో హాజరైన ర‌ష్మిక‌ కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏ స్టార్ కూడా ఆమెని ప‌ట్టించుకోలేదు. ర‌ష్మిక పక్కన ఉన్న కానీ కనీసం చూడనుకూడా చూడలేదు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఎక్స్‌లో వైర‌ల్ అవుతోంది. ర‌ష్మిక వేడుక‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా ఎదురుగా వ‌స్తున్న బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్దా క‌పూర్ అస్స‌లు ప‌ట్టించుకోన‌ట్టుగా, త‌ను ఎవ‌రో తెలియ‌న‌ట్టుగా ప‌క్క నుంచే వెళ్లిపోవ‌డంపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికి సౌత్ లో రష్మిక కనిపిస్తే జై జైలు కొట్టే హీరోలు , అభిమానులు ఉంటె..నార్త్ లో మాత్రం కనీసం పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు పాపం.