వెండితెర పై ఒక్కసారి కనిపిస్తే చాలు..వారికంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడతారు. వారు ఎక్కడికి వెళ్లిన అభిమానులు వారి వెంటపడుతూ..ఆటో గ్రాఫ్, సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ హీరోయిన్ తిరుమల పుణ్యక్షేత్రంలో కనిపిస్తే చాలామంది గుర్తు పట్టలేదు. సామాన్య మహిళగానే అందరు చూసారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా..? గోకులంలో సీత (Gokulamlo Seetha) మూవీ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటించిన రాశి (Rashi ).
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997 లో విడుదలైన ఈ చిత్రాన్ని శ్రీ పద్మసాయి చిత్ర పతాకంపై బి. శ్రీనివాస రాజు నిర్మించాడు. ఈ సినిమా మూలకథ అగస్త్యన్ అందించగా పోసాని కృష్ణమురళి మాటలు రాశాడు.. ఈ సినిమా తమిళంలో వచ్చిన గోకులత్తిల్ సీతై అనే తమిళ సినిమాకు పునర్మిర్మాణం. తండ్రి గారాబంతో విలాసాలకు అలవాటు పడి నిర్లక్ష్యంగా జీవితం గడిపే కథానాయకుడు, కథానాయిక పరిచయంతో జీవితం ఎలా మార్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. పవన్ కల్యాణ్ నటించిన రెండో మూవీ ఇది. ఈ సినిమా తో రాశి విపరీతంగా పాపులర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఐటెం సాంగ్ , విలన్ వేషాల్లో కూడా రాశి నటించింది. ప్రస్తుతం బుల్లితెర తో పాటు వెండితెర ఛాన్సులు వస్తే ఓకే చేస్తుంది. ఇదిలా ఉంటె గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అయితే రాశిని చాలామంది భక్తులు గుర్తుపట్టలేకపోయారు. కొంతమంది మాత్రం కాస్త గుర్తు పట్టి హాయ్ చెప్పడం చేసారు.
Read Also : Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్‌బుక్ !