Ranveer Singh Animal Review రణ్ బీర్ కపూర్ సందీప్ వంగ కలిసి చేసిన యానిమల్ సినిమా బాలీవుడ్ ని షేక్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర 900 కోట్లతో దూసుకెళ్లిన యానిమల్ సినిమా అప్పటివరకు ఉన్న రణ్ బీర్ కపూర్ సినిమాల రికార్డులన్నిటినీ పక్కకు నెట్టేసింది. అంతకుముందు అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా చేసిన సందీప్ వంగ యానిమల్ తో మరోసారి బాలీవుడ్ కి షాక్ ఇచ్చాడు.
We’re now on WhatsApp : Click to Join
రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా బాలీవుడ్ సెలబ్రిటీస్ ని కూడా సర్ ప్రైజ్ చేసింది. సినిమా చూసిన చాలామంది సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయగా కొందరు చిత్ర యూనిట్ కి పర్సనల్ గా కాల్ చేసి, మెసేజ్ చేసి సినిమా గురించి చెప్పారు. ఇక లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో రణ్ వీర్ సింగ్ కూడా ఉన్నాడని తెలుస్తుంది.
రణ్ వీర్ సింగ్ యానిమల్ సినిమా చూసి డైరెక్టర్ సందీప్ వంగాతో దాదాపు 40 నిమిషాల దాకా మాట్లాడాడట. అంతేకాదు ఫోన్ కాల్ తర్వాత లాంగ్ మెసెజ్ కూడా పెట్టాడు. సినిమాలో ఉన్న ప్రతి విషయం గురించి తను చాలా బాగా చెప్పాడు. నన్నే ఆశ్చర్యపోయేలా చేసింది అతని అబ్సర్వేషన్ అని సందీప్ వంగ చెప్పారు.
రణ్ బీర్ కపూర్ సినిమా గురించి రణ్ వీర్ సింగ్ ఇలా స్పందించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయం చెప్పి సందీప్ వంగ ఆ ఇద్దరి హీరోల మధ్య సాన్నిహిత్యాన్ని అందరికీ తెలిసేలా చేశారు.