Rangasthalam Combo: ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన రాబోయే సినిమాలను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం చెర్రీ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది.
రామ్ చరణ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో రంగస్థలం టాప్ స్థానంలో ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. చరణ్ లో ఉన్న నటుడ్ని బయటకు తీసింది ఈ సినిమానే. అప్పటి వరకు చరణ్ పై నటనపరంగా విమర్శలు వుండేవి. అయితే.. ఆ విమర్శలకు రంగస్థలం సినిమా కరెక్ట్ గా సమాధానం చెప్పింది. అందుకనే చరణ్ కు సుకుమార్ అంతే ప్రత్యేక అభిమానం. ఇప్పుడు రంగస్థలం కాంబో ఫిక్స్ అయ్యిందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్నారు. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా అనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు చరణ్ తో సుకుమార్ మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలోనూ, మీడియాలోనూ గట్టిగా వినిపిస్తోంది. అయితే.. సుకుమార్ దగ్గర చరణ్ కు సరిగ్గా సరిపోయే కథ ఒకటి ఉంది. ఇది నిజమే కానీ.. పూర్తి స్థాయిలో కథ రెడీగా లేదు. మరో వార్త ఏంటంటే.. పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ప్లానింగ్ లో ఉందట.
బన్నీ కూడా పుష్ప 3 చేద్దామంటున్నాడట. అందుచేత సుకుమార్ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. చరణ్ గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. బుచ్చిబాబుతో చేసే సినిమా నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు సుకుమార్ మరో సినిమా చేయకుండా చరణ్ కోసం వెయిట్ చేస్తాడా..? లేక వేరే సినిమా చేస్తాడా..? అనేది తెలియాల్సివుంది. రంగస్థలం కాంబో ఉండడం మాత్రం ఫిక్స్. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ క్రేజీ కాంబో పై క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: Bagalkot: కర్ణాటకలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి