Site icon HashtagU Telugu

Ranbir Kapoor : రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు.. ఇండియాలోనే..!

Ranbir Kapoor Sai Pallavi Yash Bollywood Ramayanam

Ranbir Kapoor Sai Pallavi Yash Bollywood Ramayanam

Ranbir Kapoor : రణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా బాలీవుడ్ లో మరో రామాయణ కథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకొని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ సెట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతూ వైరల్ అవుతూ వస్తున్నాయి. అలా లీకైన కంటెంట్ లో రణ్‌బీర్‌ కపూర్, సాయి పల్లవి లుక్స్ అండ్ షూటింగ్ సెట్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ని పెడుతున్నారట. కేవలం మొదటి భాగం కోసమే అక్షరాలా రూ.817 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఈ రేంజ్ తో బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే. ప్రభాస్ తో తెరకెక్కించిన రామాయణ కథ ‘ఆదిపురుష్’ కోసం సుమారు 700 కోట్లు ఖర్చు చేసారు. అంతటి ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించలేక నష్టాలు ఎదుర్కొంది. మరి ఇప్పుడు రణ్‌బీర్ అంతకు మించిన బడ్జెట్ తో వస్తున్నారు. ఈసారి ఏమవుతుందో చూడాలి.

కాగా ఈ సినిమా షూటింగ్ ని అయితే శరవేగంగా జరుపుతున్న మూవీ టీం.. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ చిత్ర నిర్మాతలు ఎవరు..? ఎంతమంది కలిసి నిర్మిస్తున్నారు..? అనేది క్లారిటీ లేదు. గతంలో ఈ సినిమా నిర్మాణంలో మన తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారు. కానీ ఆ తరువాత అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు.

Also read : Kalki 2898 AD : సినిమా రిలీజ్ కంటే ముందే.. కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్..!