Site icon HashtagU Telugu

Ranbir Kapoor : రణ్‌బీర్ రామాయణం షూటింగ్ స్టార్ట్ అయ్యిందా.. నెట్టింట వీడియోలు వైరల్..

Ranbir Kapoor Ramayana Movie Shooting Photos And Videos Leaked

Ranbir Kapoor Ramayana Movie Shooting Photos And Videos Leaked

Ranbir Kapoor : బాలీవుడ్ దర్శకుడు నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘రామాయణం’. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తుంటే.. కెజిఎఫ్ హీరో యశ్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, అరుణ్ గోవిల్ దశరథ్‌గా, లారా దత్తా కైకేయిగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్ శూర్పణఖగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ షూటింగ్ ని సైలెంట్ గా ఎటువంటి హడావుడి లేకుండా స్టార్ట్ చేసేసారట.

ఈ మూవీని ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ నెల శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న పూజాకార్యక్రమాలతో మూవీ గ్రాండ్ గా లాంచ్ చేసి అనౌన్స్ చేయనున్నారని, జూన్ లేదా జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు సడన్ గా నెట్టింట ఈ మూవీ షూటింగ్ సెట్స్ కి సంబంధించిన ఫోటోలు దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ కోసం భారీ సెట్స్ ని నిర్మించారు. లీకైన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. ప్రస్తుతం రాముడి చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు తెలుస్తుంది. ఆ ఫొటోల్లో అరుణ్ గోవిల్, లారా దత్తా కనిపించారు. ఇక ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ సెట్స్ నుంచి నెట్టింట భారీగా ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వడంతో దర్శకుడు సీరియస్ అయ్యారట. ఇక నుంచి సెట్స్ లో నో ఫోన్ పాలసీని అమలులో పెట్టబోతున్నారట.

కాగా ఈ సినిమాకి ఇద్దరు ఆస్కార్ విన్నర్లు ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారట. హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హన్స్ జిమ్మెర్.. మ్యాన్ ఆఫ్ స్టీల్, ది డార్క్ నైట్ ట్రయాలజీ, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, మిషన్ ఇంపాజిబుల్, గ్లాడియేటర్, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్.. వంటి టాప్ హాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ చేసారు.

Also read : Ram Charan : రచ్చ సినిమా షూటింగ్‌లో.. రామ్‌చరణ్‌కి రైలు యాక్సిడెంట్..