రామాయణ మూవీ ర‌న్ టైమ్ ఎంతో తెలుసా?

‘రామాయణ’ చిత్రం బడ్జెట్ 4000 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. సినిమాలోని ప్రతి చిన్న అంశంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ramayana

Ramayana

Ramayana: రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా నిడివి (రన్‌టైమ్) గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎంత నిడివి ఉంటుంది. ఇది ‘ధురంధర్ 2’ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రణబీర్ కపూర్ ఏమన్నారు?

వాస్తవానికి ఇటీవల లాస్ ఏంజిల్స్ లో జరిగిన తన రాముడి లుక్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో రామాయణం రెండు భాగాల స్క్రీన్‌టైమ్ గురించి రణబీర్ కపూర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ వద్ద దాదాపు 6 గంటల ఫుటేజ్ ఉందని ఆయన తెలిపారు. సినిమా పార్ట్ 2కు సంబంధించి ఇంకా కొంత షూటింగ్ జరగాల్సి ఉంది. కాబట్టి రెండు సినిమాల రన్‌టైమ్ బహుశా 3 గంటల కంటే ఎక్కువగా ఉండవచ్చు.

Also Read: భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్‌!

‘ధురంధర్ 2’ రన్‌టైమ్ ఎంత?

రణబీర్ మాట్లాడుతూ.. మా వద్ద 6 గంటల ఎపిక్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పారు. అయితే సినిమా రన్‌టైమ్ గురించి ఇంకా ఏదీ ఖచ్చితంగా చెప్పలేమని, సెన్సార్ బోర్డ్ అనుమతి తర్వాతే తుది నిడివి ఎంతో తెలుస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ‘ధురంధర్ 2’ సినిమా గురించి చెప్పాలంటే ఆ చిత్రం రన్‌టైమ్ దాదాపు 4 గంటల వరకు ఉంటుంది.

‘ధురంధర్ 2’ రికార్డు బద్దలవుతుందా?

‘ధురంధర్ 2’ రన్‌టైమ్ విషయానికి వస్తే.. ఈ సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు (229 నిమిషాలు). అయితే రణబీర్ సినిమా రన్‌టైమ్ అంతకంటే తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ‘రామాయణ’ చిత్రం ఇదే నిడివితో వస్తే అది ‘ధురంధర్ 2’ రికార్డును బద్దలు కొట్టలేదు. ఎందుకంటే ఆ సినిమా రన్‌టైమ్ దాదాపు 4 గంటల వరకు ఉంది. కానీ తుది రన్‌టైమ్ కోసం ఇంకా వేచి చూడాల్సిందే.

ఎప్పుడు విడుదలవుతుంది?

‘రామాయణ’ చిత్రం బడ్జెట్ 4000 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. సినిమాలోని ప్రతి చిన్న అంశంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇక విడుదల విషయానికి వస్తే ఈ సినిమా పార్ట్ 1ని దీపావళి 2026లో, పార్ట్ 2ని దీపావళి 2027లో విడుదల చేయనున్నారు.

  Last Updated: 04 Apr 2026, 09:33 PM IST