Animal Teaser : రణ్ బీర్ యానిమల్ టీజర్ టాక్.. సందీప్ వంగా మార్క్..!

Animal Teaser అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్

Published By: HashtagU Telugu Desk
Ranbhir Kapoor Animal Tease

Ranbhir Kapoor Animal Tease

Animal Teaser అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా రణ్ బీర్ కపూర్ (Ranbhir Kapoor) తో యానిమల్ అంటూ వస్తున్న విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. రణ్ బీర్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ వచ్చింది. టీజర్ లోకి వస్తే తన ప్రేయసితో మాట్లాడుతున్న హీరో తన తండ్రి గురించి ఆమె చెడు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే నువ్వు ఏదైనా అడుగు కానీ నా తండ్రి గురించి మాట్లాడకు అంటూ ఆమెను మందలిస్తాడు రణ్ బీర్.

ఇక తండ్రి కొడుకుల మధ్య సన్నివేషాలు, రణ్ బీర్ వైలెన్స్ సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ ని చూపిస్తున్నాయి. కథ ఏంటన్నది కొంతమేరకు తెలుస్తున్నా కన్ ఫ్లిక్ట్ పాయింట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి యానిమల్ (Animal Teaser) నుంచి అప్పట్లో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే షాక్ ఇవ్వగా ఇక నేడు రిలీజైన ఈ టీజర్ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ అనిపించింది.

రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలో బాబి డియోల్ (Bobby Deol) బ్యాడ్ గాయ్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రణ్ బీర్ కపూర్ ఫాదర్ రోల్ లో అనీల్ కపూర్ (Anil Kapoor) కి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్టు ఉంది. మొత్తానికి తెలుగు దర్శకుడు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ యానిమల్ సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉంది.

యానిమల్ టీజర్ సినిమాకు శాంపిల్ మాత్రమే సినిమా మీ అంచనాలకు ఏమాత్రం తగ్గదన్నట్టుగా చెబుతున్నారు మేకస్. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు. పన్ ఇండియాని షేక్ చేయాలని చూస్తున్న యానిమల్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Skanda : రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్.. స్కంద లెక్కలు ఎలా ఉన్నాయంటే..!!

  Last Updated: 28 Sep 2023, 12:01 PM IST