ఎన్టీఆర్ (NTR) కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర 1 రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఐతే రీసెంట్ ఇంటర్వ్యూలో కొరటాల శివ దేవర పార్ట్ 2 (Devara 2) మరింత పెద్దగా ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు రణ్ భీర్ కపూర్, రన్ వీర్ సింగ్ లాంటి స్టార్స్ కూడా నటించే స్కోప్ ఉందని అన్నారు. అప్పటి నుంచి దేవర 2 లో రన్ వీర్, రణ్ భీర్ ఇద్దరిలో ఎవరు నటిస్తారా అన్న ఆసక్తి మొదలైంది.
ఈమధ్య సౌత్ సినిమాల మీద బాలీవుడ్ స్టార్స్ (Bollywood Stars) ఇంట్రెస్ట్ తెలిసిందే. మన కథలను పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే అక్కడ వారు కూడా మన సినిమాలు చేయాలని ఉత్సాహపడుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా సినిమాలో ఛాన్స్ వస్తే కాదనకుండా చేస్తున్నారు. ఆల్రెడీ ఎన్ టీ ఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో వార్ 2 లో భాగం అవుతున్నాడు కాబట్టి దేవర పార్ట్ 2 లో బాలీవుడ్ స్టార్ ని తీసుకోవాలని చూస్తున్నారట.
కొరటాల శివ దేవర 2 ప్లానింగ్..
కొరటాల శివ (Koratala Siva) రణ్ భీర్, రన్ వీర్ అంటూ హింట్ ఇచ్చాడు కానీ ఆ ఇద్దరిలో ఎవరైనా మాకు ఓకే అనేస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ దేవర 2 ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. దేవర, వర గా తారక్ మరోసారి అదరగొట్టబోతున్నారు. ప్రస్తుతం వార్ 2 కోసం తన డేట్స్ ఇచ్చిన ఎన్ టీ ఆర్ జనవరి 2025 నుంచి ప్రశాంత్ నీల్ సినిమాకు సిద్ధం అవుతున్నాడు.
దేవర 2 లో బాలీవుడ్ స్టార్స్ ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తప్పకుండా అదే జరిగితే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.
Also Read : Maa Nanna Super Hero Review & Rating : మా నాన్న సూపర్ హీరో రివ్యూ & రేటింగ్