ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(Betting App)లతో సంబంధం ఉన్న మనిలాండరింగ్ కేసులో Enforcement Directorate (ED) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana) ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తన షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను హాజరుకాలేనని ఈడీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరికొంత గడువు ఇవ్వాలని కోరారు.
Sleeping Amenia : స్లీపింగ్ అమ్నియాతో బాధపడుతున్నారా? దీని లక్షణాలు మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి
రానా చేసిన ఈ విజ్ఞప్తిని ఈడీ పరిగణలోకి తీసుకుంది. ఆయనకు తదుపరి విచారణ తేదీని త్వరలోనే తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. గతంలో ఈ కేసులో ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లను విచారించిన ఈడీ, ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులపైనా దృష్టి పెట్టింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా వారిని విచారించాలని భావిస్తోంది.
ఈ కేసులో రానా తో పాటు మరో ముగ్గురు ప్రముఖులకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని సమన్లు అందించారు. వీరంతా గతంలో తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు పిలుస్తున్నారు.
Air India : మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. ఈ సారి ఢిల్లీలో
ఈ కేసు నేపథ్యంలో టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేగింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు విచారణకు హాజరవ్వాల్సి రావడం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రజల డబ్బుతో మోసం జరుగుతోందన్న ఆరోపణలతో విచారణ జరుపుతున్న ఈడీ, మరిన్ని పేర్లను త్వరలోనే బహిర్గతం చేయవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.