Rana Daggubati : రానా దగ్గుబాటి.. టాలీవుడ్ లో బిజీగా ఉండే స్టార్స్ లో ఒకరు. ఓ పక్క హీరోగా సినిమాలు, మరో పక్క విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మరో పక్క యాడ్స్. మరో పక్క నిర్మాతగా, మరో పక్క పలు బిజినెస్ లు.. ఇలా అన్ని వైపులా బిజీగా ఉంటాడు రానా దగ్గుబాటి. తాజాగా మరో కొత్త బాధ్యత తీసుకున్నాడు రానా.
రానా గతంలో నెంబర్ 1 యారి అనే టాక్ షో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సరికొత్త టాక్ షో తో రాబోతున్నాడు. ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో కొత్త టాక్ షోని ప్రారంభించబోతున్నాడు రానా. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 23 నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ రానుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయాయి.
ది రానా దగ్గుబాటి షోకు ఆర్జీవీ, రాజమౌళితో పాటు శ్రీలీల, నాని, సిద్ధూ జొన్నలగడ్డ, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్.. ఇలా పలువురు స్టార్స్ వచ్చారట. మొదటి సీజన్ లో కొన్ని ఎపిసోడ్స్ తో చేసి ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండో సీజన్ తో వస్తారట. ఈ షోకి నిర్మాత కూడా రానానే కావడం గమనార్హం.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు.. పుష్పకు పోటీగా రావట్లేదు..