Site icon HashtagU Telugu

Rana Daggubati : బాలీవుడ్ హీరోయిన్‌కి సారీ చెప్పిన రానా.. మొన్నేమో అలా అనేసి..

Rana Daggubati says sorry to Bollywood Heroine Sonam Kapoor

Rana Daggubati says sorry to Bollywood Heroine Sonam Kapoor

హీరో రానా(Rana) ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటించిన కింగ్ అఫ్ కోత(King of Kotha) తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు. రానా, దుల్కర్ యాక్టింగ్ స్కూల్ నుంచే స్నేహితులు. అయితే ఈ ఈవెంట్ లో దుల్కర్ మంచితనం గురించి చెప్తూ నిజంగా జరిగిన ఓ సంఘటన చెప్పాడు.

దుల్కర్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్ దుల్కర్ ని బాగా ఇబ్బంది పెట్టిందని, దుల్కర్ ని నిలబెట్టి షూట్ మధ్యలో వెళ్లి భర్తతో ఫోన్స్ మాట్లాడుకునేది, డైలాగ్స్ కూడా చెప్పకుండా టేకులు తీసుకునేదని, అంత ఇబ్బంది పెట్టినా దుల్కర్ సైలెంట్ గానే ఉన్నాడని అన్నాడు. ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ ని కూడా హీరోయిన్ అలా చేస్తుంటే మీరేమి అనరా అని తిట్టినట్టు రానా చెప్పాడు. అయితే ఇవన్నీ కూడా బాలీవుడ్(Bollywood) భామ సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించే.

దుల్కర్ – సోనమ్ కలిసి ది జోయా ఫ్యాక్టర్ అనే ఓ సినిమా చేశారు. ఆ సినిమా సమయంలోనే ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. అయితే రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ లో కూడా రానా సోనమ్ ని తిట్టాడని వార్తలు రాశారు. దీంతో రానా ఇవాళ సారీ చెప్తూ ఓ ట్వీట్ చేశాడు.

రానా తన ట్వీట్ లో.. నేను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా నెగిటివిటి ప్రచారం చేశారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అవి నేను ఒక సంఘటన జరిగిందని చాలా మాములుగా చెప్పాను. సోనమ్ కూడా నా స్నేహితురాలే. నా వ్యాఖ్యలని ఇంతలా నెగిటివ్ చేసి ప్రమోట్ చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను.సోనమ్ కపూర్ కి, దుల్కర్ కి కూడా ఈ విషయంలో నేను హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఈ వార్తలకి ముగింపు పలకాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

 

Also Read : Hyper Aadi : వర్షిణి నో చెప్పింది.. మరి హైపర్ ఆది ప్రేమించేది ఆ అమ్మాయినేనా?