RGV : గరికపాటి… మాకు నువ్వు గ(డ్డిప)పరకతో సమానం..!!

మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Rgv

Rgv

మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బండారు దత్తత్రేయ నిర్వహించిన అలాయ్-బలాయ్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అయితే దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. హే గరికపాటి నువ్వు గడ్డి పరికతో సమానం అంటూ ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.

సారీ నాగబాబు గారు…చిరంజీవిని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదు…చిరంజీవిని అవమానించినవాడు మా ద్రుష్టిలో గడ్డిపరకతో సమానం తగ్గేదేలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో అంతేకానీ పబ్లిసిటీ కోసం మొరగొద్దు. చిరంజీవి గురించి తెలుసుకో అంటూ మండిపడ్డారు. హేగుగురుపాటి నరసింహారావు తమరు గడ్డిపరిక అయితే మా చిరంజీవి నరసింహా…ఆ మిగిలిన రావుని మీ పంచజేబులో పెట్టుకో అంటూ హెచ్చరించారు రాంగోపాల్ వర్మ.

  Last Updated: 11 Oct 2022, 08:02 AM IST