Ram Skanda : టాక్ తో సంబంధం లేని వసూళ్లు.. స్కంద ఫస్ట్ డే ఎంత తెచ్చిందంటే..!

Ram Skanda రామ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన స్కంద సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు టాక్ డివైడ్

Published By: HashtagU Telugu Desk
Ram Skanda First Day Collec

Ram Skanda First Day Collec

Ram Skanda రామ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన స్కంద సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు టాక్ డివైడ్ గా ఉన్నా వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. రామ్ ఈ రేంజ్ లో ఊర మాస్ సినిమా తన కెరీర్ లో ఇప్పటివరకు చేయలేదు. కథ కథనాలు వీక్ అని టాక్ వచ్చినా మాస్ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా ఎంటర్టైన్ చేసిందని అంటున్నారు. అయితే సినిమాకు ఉన్న బజ్ కావొచ్చు ప్రమోషన్స్ తో వచ్చిన హైప్ వల్ల కావొచ్చు కానీ రామ్ స్కంద సినిమాకు ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి.

నైజాం లో 3.23 కోట్లు ఉత్తరాంధ్ర 1.19 కోట్లు సీడెడ్ 1.22 కోట్లు ఈస్ట్ 59 లక్షలు, వెస్ట్ 41 లక్షలు కలెక్ట్ చేయగా కృష్ణాలో 45 లక్షలు గుంటూరు లో 1.04 కోట్లు నెల్లూరు లో 49 లక్షలు షేర్ రాబట్టింది స్కంద. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు 8.62 కోట్లు కలెక్ట్ చేసింది. రామ్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తుంది.

రామ్ (Ram Skanda) ఊర మాస్ అవతార్ తన ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. అయితే సినిమా ఫస్ట్ డే ఎలాంటి సినిమాకైనా వసూళ్లు (Skanda Collections) బాగుంటాయి. అసలు లెక్క ఏంటన్నది సోమవారం నుంచి తెలుస్తుంది. 44 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన స్కంద ఇదే వసూళ్ల దూకుదు చూపిస్తాడా లేదా అన్నది చూడాలి.

రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సయి మంజ్రేకర్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. సినిమాలో మాస్ అంశాలు తప్ప మిగతావి ఏవి వర్క్ అవ్వకపోవడంతో టాక్ అయితే నెగిటివ్ గానే నడుస్తుంది. మరి సినిమా నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Varun Tej : ఫ్లాపులున్నా బిజినెస్ అదుర్స్.. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ హయ్యెస్ట్ డీల్..!

  Last Updated: 29 Sep 2023, 11:10 AM IST