Ram Skanda : ఐదు యాక్షన్ బ్లాక్స్.. సీట్లలో ఎవరు ఉండరా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా స్కంద (Ram Skanda). రామ్ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్

Published By: HashtagU Telugu Desk
Ram Skanda 5 Action Blocks

Ram Skanda 5 Action Blocks

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా స్కంద (Ram Skanda). రామ్ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత మీద వేసుకున్న బోయపాటి స్కంద ని తన మార్క్ ఊర మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని తెలుస్తుంది. సినిమా ట్రైలర్ కొంత నిరాశ పరచినా రిలీజ్ ముందు మరో ట్రైలర్ సినిమాలోని అసలు మ్యాటర్ శాంపిల్ గా చూపిస్తారని తెలుస్తుంది.

ఈ నెల 28న రిలీజ్ అవుతున్న స్కంద సినిమా రిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లేటెస్ట్ గా మొదలు పెట్టారు. ఈ ఇంటర్వ్యూస్ లో సినిమా గురించి మరింత ఆసక్తి కలిగించే విషయాలను వెళ్లడించారు. సినిమాలో మొత్తం ఐదు ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ లు ఉన్నాయని. ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తాయని అంటున్నారు. రామ్ ని ఇలా ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో చూడాలని ఎప్పటి నుంచో అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇన్నాళ్లకు బోయపాటి వల్ల అది కుదిరింది.

Ram Skanda సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అని అంటున్నారు. స్కంద సినిమా మీద రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వా రామ్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు.

రామ్ బోయపాటి కాంబోలో వస్తున్న స్కంద మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అని అంటున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక దానికి మించి మరోటి ఉంటుందని చెబుతున్నారు. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న స్కంద బాక్సాఫీస్ దగ్గర రాం స్టామినా చూపిస్తుందా లేదా అన్నై మరో ఐదు రోజుల్లో తెలుస్తుంది.

Also Read : Manchu Vishnu Kannappa : ప్రభాస్ శివుడు.. నయనతార పార్వతి..!

  Last Updated: 23 Sep 2023, 03:53 PM IST