Ram – Puri Jagannath డబుల్ ఇస్మార్ట్ ఆ డేట్ కష్టమేనా..?

Ram - Puri Jagannath ఎనర్జిటిక్ స్టార్ రామ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్

Published By: HashtagU Telugu Desk
Ram Puri Jagannath Double Ismart Release Postpone

Ram Puri Jagannath Double Ismart Release Postpone

Ram – Puri Jagannath ఎనర్జిటిక్ స్టార్ రామ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో మొదలైన ఈ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని కూడా తీసుకున్నారు. సినిమాలో విలన్ గా సంజయ్ దత్ కనిపిస్తారని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

డబుల్ ఇస్మార్ట్ సినిమా మొదలైన నాడే 2024 మార్చి 8న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. సినిమా అనుకున్న టైం కు తీసుకు రావడంలో పూరీ ఎప్పుడు ముందుంటాడు. కానీ ఈసారి డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో ప్లాన్ మారుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని మెప్పించేలా తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్.

ఆల్రెడీ పూరీ తో ఇస్మార్ట్ శంకర్ చేసిన రామ్ ఆ సినిమా హిట్ తో ఇద్దరిని సూపర్ ఫాం లోకి వచ్చేలా చేసింది. లైగర్ తో మరో ప్రయత్నం చేసిన పూరీ ఆ సినిమాతో మళ్లీ ట్రాక్ తప్పాడు. అయితే మళ్లీ తిరిగి డబుల్ ఇస్మార్ట్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. రామ్ తో పూరీ మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది. పూరీ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ తన మార్క్ యాక్షన్ ప్రెజెన్స్ ఇస్తారని అంటున్నారు.

Also Read : Sreeleela : శ్రీలీలకు ‘ఐరెన్ లెగ్’ అనే బిరుదు వచ్చినట్లేనా..?

పూరీ తీసే డబుల్ ఇస్మార్ట్ మీదే రామ్ కెరీర్ కూడా ఆధారపడి ఉంది. లాస్ట్ ఇయర్ స్కంద అంటూ చేసిన ప్రయత్నం విఫలమవడంతో రామ్ తన హోప్స్ అన్నీ డబుల్ ఇస్మార్ట్ మీదే పెట్టుకున్నాడు. పూరీతో సినిమా అంటే అయితే సూపర్ హిట్ లేదంటే సూపర్ ఫ్లాప్ మరి డబుల్ ఇస్మార్ట్ ఈ రెండిటిలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. పూరీ ఏ సినిమా ఎలా తీస్తాడన్నది చెప్పడం కష్టం. లైగర్ ఫ్లాప్ తో పూరీ అందరి చేత టార్గెట్ అవ్వబడ్డాడు తప్పకుండా డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి పూరీ తన మార్క్ చూపిస్తాడని చెప్పొచ్చు.

  Last Updated: 18 Jan 2024, 02:59 PM IST