Site icon HashtagU Telugu

Double Ismart OTT Deal : డబుల్ ఇస్మార్ట్ OTT డీల్ క్లోజ్.. పూరీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

Ram Puri Jagannaath Double Ismart Update

Ram Puri Jagannaath Double Ismart Update

Double Ismart OTT Deal రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ ని రిపీట్ చేయాలనే ఆలోచనతో పూరీ ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం ముంబైలోనే షూట్ చేస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ ముందే బిజినెస్ జరుగుతుంది. సినిమా మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారట.

డబుల్ ఇస్మార్ట్ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు కొనేశారట. సినిమా రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ డీల్ జరిగింది. సినిమా బిజినెస్ కూడా రామ్ కెరీర్ బెస్ట్ గా జరుగుతుందని టాక్.

రామ్ పూరీ మరోసారి ఇస్మార్ట్ శంకర్ రేంజ్ రిజల్ట్ ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్కంద తర్వాత రామ్  చేస్తున్న ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ మళ్లీ తన సత్తా చాటాలని చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో మేకర్స్ చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ నటించగా సీక్వల్ లో ఎవరు హీరోయిన్ గా చేస్తున్నారన్నది ఇప్పటివరకు రివీల్ చేయలేదు.

Also Read : NTR Vs Rajinikanth : రజినీతో ఎన్టీఆర్ ఢీ.. రసవత్తరంగా పోటీ..!