తెలుగు డైరెక్టర్లలో బోయపాటిది డిఫరెంట్ జానర్. మాస్ అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయన్ను మించినవారు లేరని చెప్పక తప్పదు. అఖండ సక్సెస్ తో మళ్లీ రేసులోకొచ్చాడు. అయితే ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని భావించారు చాలామంది. కానీ బోయపాటి నెక్ట్స్ సినిమా రామ్ తో ఉంటుందని టాలీవుడ్ టాక్. ముందుగా అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ “పుష్ప” రెండవ భాగాన్ని వెంటనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. “పుష్ప 2” పూర్తయ్యే వరకు ఏ ప్రాజెక్ట్ ను ఓకే చెయ్యడు కూడా. అల్లు అర్జున్ ఆలోచనా విధానాన్ని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. బోయపాటి తన తదుపరి చిత్రాన్ని రామ్ పోతినేనితో డైరెక్ట్ చేయనున్నాడు. “అఖండ” విజయం తర్వాత బోయపాటి మళ్లీ రేసులోకి వచ్చాడు.
అయితే టాప్ నటీనటులు మాత్రం వెంటనే అతనితో జోడీ కట్టేందుకు ఇష్టపడడం లేదు. రామ్ పోతినేని మాత్రం బోయపాటితో జోడీ కట్టడం మాస్ హీరోగా తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటుందని భావిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ నటుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ను త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ‘అఖండ’ ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.