Ram Pothineni : ‘రెడీ’ కాంబో మళ్ళీ సెట్ అవుతుందా..? శ్రీనువైట్లతో రామ్ మూవీ టాక్స్..!

'రెడీ' కాంబో మళ్ళీ సెట్ అవుతుందా..? శ్రీనువైట్లతో రామ్ స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారట.

Published By: HashtagU Telugu Desk
Ram Pothineni Srinu Vaitla Is Work Together Again After Ready Success

Ram Pothineni Srinu Vaitla Is Work Together Again After Ready Success

Ram Pothineni : ఉస్తాద్ హీరో రామ్ పోతెనేని ప్రస్తుతం సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తరువాత మళ్ళీ ఒక మంచి విజయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల వచ్చిన ‘స్కంద’ సినిమా కూడా యావరేజ్ గానే ఆడింది. దీంతో ఉస్తాద్ ఫ్యాన్స్.. రామ్ నుంచి ఒక మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కోసం ఒక సాలిడ్ హిట్ ఇచ్చేందుకు రామ్.. తన పాత దర్శకులనే నమ్ముకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్టుని అందించిన పూరితో కలిసి రామ్.. డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత తనకి గతంలో ‘రెడీ’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీనువైట్లతో మూవీ చేసేందుకు చూస్తున్నారట. శ్రీనువైట్ల ఇటీవలే రామ్ ని కలుసుకొని ఒక కథ వినిపించారట. ప్రస్తుతం ఈ స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఒకవేళ ఫైనల్ స్టోరీ స్క్రిప్ట్ ఓకే అయితే.. రెడీ కాంబో మళ్ళీ సెట్ అయ్యినట్లే.

కాగా శ్రీనువైట్ల ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీచంద్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రిజల్ట్ పై కూడా శ్రీనువైట్ల, రామ్ కాంబో ఆధారపడి ఉంటుంది. మరి శ్రీనువైట్ల గోపీచంద్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా చూడాలి.

ఇక డబుల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే.. పూరిజగన్నాథ్ కూడా ప్లాప్ ల్లోనే ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్న రామ్ అండ్ పూరి.. ఆ తరువాత మరో హిట్టుని అందుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఒక హిట్టు అందుకోవడం కోసం రామ్, పూరి చేతులు కలిపారు. మరి ఈ మూవీ ఈ ఇద్దరు కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా చూడాలి.

Also read : Baahubali : కట్టప్ప విలన్‌గా బాహుబలి యానిమేషన్ సిరీస్.. ట్రైలర్ చూసారా..?

  Last Updated: 02 May 2024, 03:56 PM IST