Ram Pothineni: పెళ్లి పీటలెక్కబోతున్న హీరో రామ్, బిజినెస్ మేన్ కూతురితో ఏడడుగులు?

అన్నీ కుదిరితే రామ్ పోతినేని కూడా తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Ram Pothineni

Ram Pothineni

టాలీవుడ్ (Tollywood) వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) పెళ్లి చేసుకొని ఇంటివాడుకాగా, వరుణ్ తేజ్ కూడా లావణ్యను పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోలు రానా, నిఖిల్, నితిన్ లు కూడా ఇప్పటికే వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో రామ్ పోతినేని పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అన్నీ కుదిరితే రామ్ పోతినేని (Ram Pothineni) కూడా తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. 35 ఏళ్ల వయస్సులో, రామ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. చిన్న వయస్సులోనే స్టార్‌డమ్‌కి ఎదిగిన నటుడిగా, ఇన్నాళ్లూ తన కెరీర్‌పై మాత్రమే దృష్టి పెట్టాడు. దీంతో పెళ్లిని (Marriage) వాయిదా వేస్తూ వస్తున్నాడు.

అయితే ఈ సారి ఇక వాయిదా వేయకూడదన్న కృతనిశ్చయంతో రామ్ ఉన్నారని సన్నిహితులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తరువాత, అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక చిత్రానికి పని చేయాల్సి ఉంది. అయితే రామ్ పెళ్లిపై గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి పుకార్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

Also Read: AAA Theatres: ఫ్యాన్స్ కు పూనకాలే, అల్లు అర్జున్ థియేటర్ లో ఆదిపురుష్ మూవీ

  Last Updated: 15 Jun 2023, 02:17 PM IST