RGV: తన సినిమా ప్రమోషన్ కి ‘RRR’ ను వాడుకుంటున్న ‘వర్మ’..!

  • Written By:
  • Publish Date - March 31, 2022 / 11:55 AM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం (డేంజరస్)’. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ఇందులో అప్సర రాణి, నైనా గంగూలీలు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీబిజీగా ఉన్నారు. అయితే తనకు మాత్రమే తెలిసిన ప్రమోషన్ స్ట్రాటజీని మరోసారి ప్రదర్శిస్తున్నారు వర్మ. తన మూవీ ప్రమోషన్ లో భాగంగా వర్మ ఏ అంశాన్నీ వదలడం లేదు. అన్ని అంశాలను తన సినిమా ప్రమోషన్ కు వాడేసుకుంటున్నారు.

‘RRR’ ఘన విజయంతో ఆ సినిమాని వాడేసుకుంటున్నారు ఆర్జీవీ. తాజాగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కూడా వదలలేదు వర్మ. ‘వెల్ రాజమౌళి సార్. మీకు తారక్, రామ్ చరణ్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు నైనా గంగూలీ, అప్సర రాణి వంటి డేంజరస్ గర్ల్స్ ఉన్నారు’ అని సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు చరణ్, రాజమౌళి, తారక్ కలిసి ఉన్న ఫొటోతో పాటు… అప్సర, నైనాలతో తాను కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా కూడా రూపాయి ఖర్చు లేకుండా తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు.