Peddi Glimpse: రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ (Peddi Glimpse) ఏప్రిల్ 6, 2025న శ్రీరామ నవమి సందర్భంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. “ఉప్పెన” వంటి విజయవంతమైన చిత్రంతో బుచ్చిబాబు గుర్తింపు పొందారు. “పెద్ది” చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఒక కీలకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అతని మునుపటి చిత్రాలైన “ఆర్‌ఆర్‌ఆర్” వంటి భారీ విజయాల తర్వాత వస్తోంది.
ఈ గ్లింప్స్ విడుదల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఆధారిత కథనంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఆమెకిది రెండో తెలుగు సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ మున్నాబాయ్, జగపతి బాబు, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read: Green Chilli Water: పచ్చి మిరపకాయలను నానపెట్టి ఆ నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
#PeddiFirstShot – Glimpse video out on 6th April on the occasion of Sri Rama Navami ❤️🔥
Wishing you a very Happy Ugadi ✨#Peddi 🔥
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas… pic.twitter.com/JBsv5ugWgF
— BuchiBabuSana (@BuchiBabuSana) March 30, 2025
“పెద్ది” చిత్రాన్ని వృద్ధి ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. 2025లో విడుదల కానున్నట్లు సమాచారం. ఫస్ట్ గ్లింప్స్ ద్వారా చిత్ర యూనిట్.. కథ, సారాంశాన్ని, రామ్ చరణ్ పాత్ర తీవ్రతను పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ గ్లింప్స్ అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించడంతో పాటు, చిత్రం పై హైప్‌ను మరింత పెంచనుంది. ఏప్రిల్ 6న విడుదలయ్యే ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఇటీవల మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపించారు. చెవికి పోగు, లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో సరికొత్త లుక్‌లో కనిపించాడు.