టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన యాక్టింగ్ తోనే కాదు.. అభిరుచులు, అలవాట్లతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ ఎంతో ఫేమస్సో, ఆయన పెట్ డాగ్ కూడా అంతే పాపులర్. ఇటీవల సోషల్ మీడియాలో పెట్ డాగ్ రైమ్స్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా లేనప్పటికీ, చరణ్ పెంపుడు కుక్క రైమ్ (Rhyme) ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడానికి ఆసక్తి చూపుతుంటాడు.
రామ్ చరణ్, అతని భార్య, ఉపాసన (Upasana) కామినేని కొణిదెలకు పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ఈ జంట తరచుగా రైమ్‌ను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చాలాసార్లు చూశాం కూడా. రైమ్ రామ్ చరణ్, ఉపాసనతో కార్ రైడ్‌లు, విహారయాత్ర, సినిమా షూట్స్ కు కూడా వెళ్తుంది. ధర రూ. 35,000, రూ. 70,000 మధ్య ఉంటుంది. రామ్ చరణ్, ఉపాసన మాత్రమే కాదు.. మెగా కుటుంబమంతా రైమ్ ను ఇష్టపడుతోంది.
రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ (Ram Charan) ఒళ్లోనే పెరిగింది. రామ్ చరణ్ విదేశాలకు షూటింగ్ లకు వెళ్లే సమయంలో చార్టర్డ్ విమానంలో ఇది కూడా ఉండాల్సిందే. షూటింగ్ లు లేకపోతే రామ్ చరణ్ కు ఇంట్లో దీంతోనే టైమ్ పాస్. చరణ్, ఉపాసన దీన్ని (Pet) కన్నబిడ్డలా ఎంతో మమకారంతో చూస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. అన్నట్టు… రైమ్ కు ఇన్ స్టాగ్రామ్ లో సొంత అకౌంట్ కూడా ఉందండోయ్. ఆ అకౌంట్ ను 58 వేల మంది ఫాలో అవుతున్నారంటే రైమ్ ఎంత పాప్యులరో అర్థమవుతుంది.
Also Read: Dhoni’s Production: ఎంఎస్. ధోని నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇదే!