Site icon HashtagU Telugu

Ram Charan : ఎఆర్‌ రెహ్మాన్‌ కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రామ్ చ‌ర‌ణ్..

Ram Charan

Ram Charan

Ram Charan : రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ RC16 సినిమా వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించారు. గతంలో రామ్ చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్‌ రెహ్మాన్‌ కు కడప దర్గా సందర్శిస్తాను అని మాట ఇచ్చాడు.

తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు చరణ్. ఇచ్చిన మాట ప్ర‌కారం రామ్ చరణ్ క‌డ‌ప ద‌ర్గాలో జ‌రిగిన 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు నిన్న రాత్రి హాజ‌ర‌య్యారు. ఈ ద‌ర్గాను ఎఆర్‌ రెహ్మాన్‌ రెగ్యులర్ గా సంద‌ర్శిస్తుంటారు. 2024లో ఇక్క‌డ జ‌రిగే 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు చ‌ర‌ణ్‌ను తీసుకొస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చ‌ర‌ణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు RC16 సినిమాతో బిజీగా ఉన్నా, మరోవైపు అయ్య‌ప్ప స్వామి దీక్ష‌లో ఉన్నా రెహ్మాన్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు చ‌ర‌ణ్‌.

కడప దర్గాలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. కడప దర్గాతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ ద‌ర్గా రుణం తీర్చుకోలేనిది. నా కెరీర్‌లో ఎంతో ముఖ్య‌మైన మ‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు రోజు నేను ఈ ద‌ర్గాను సంద‌ర్శించుకున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి మంచి స్టార్ డ‌మ్ తీసుకొచ్చిందో అంద‌రికీ తెలిసిందే. ఎఆర్‌ రెహ్మాన్‌ గారు ఈ ద‌ర్గాలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలని మూడు నెల‌ల కిందే ఆహ్వానించారు. నేను కూడా వ‌స్తాన‌ని ఆయ‌న‌తో అన్నాను. ఆయ‌న‌కు ఇచ్చిన మాట కోసం, మాల‌లో ఉన్నా కూడా ఈ ద‌ర్గాకు వ‌చ్చాను. ఇక్క‌డ‌కు రావ‌టం ఆనందంగా ఉంది అని అన్నారు.

 

Also Read : Harish Rao : ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ.. KCR సినిమా ఈవెంట్లో హరీష్ రావు..