Ram Charan : టిల్లు గాడిని చూస్తే చాలా గర్వంగా ఉందంటున్న రామ్ చరణ్.. పోస్ట్ వైరల్

టిల్లు గాడిని చూస్తే చాలా గర్వంగా ఉందంటూ రామ్ చరణ్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Tweet On Siddhu Jonnalagadda Tillu Square Movie Success

Ram Charan Tweet On Siddhu Jonnalagadda Tillu Square Movie Success

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టిల్లు గాడి గురించి ఒక స్పెషల్ పోస్ట్ వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. సిద్ధూ జొన్నలగడ్డ తన సూపర్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రానికి సిద్ధూనే కథని, మాటల్ని అందించారు. ఇక మొదటి భాగంలో నేహశెట్టితో సందడి చేసిన సిద్ధూ, ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ తో కలిసి గోల చేసాడు.

మార్చి 29న ఈ మూవీ రిలీజయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాదించేసి ప్రస్తుతం 100 కోట్ల మార్క్ పై పరుగులు పెడుతుంది. కాగా టిల్లు ఫ్రాంచైజ్ కి టాలీవుడ్ హీరోల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డీజే టిల్లు సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయ్యిపోయారు. ఆ సినిమా చూడమని అప్పటిలో రామ్ చరణ్ కి కూడా రికమండ్ చేసారు. ఇక ఆ సినిమా చూసిన వీరిద్దరూ ఇప్పుడు టిల్లు స్క్వేర్ ని కూడా చూసి ఎంజాయ్ చేసేసారు.

అంతేకాదు, సినిమా సక్సెస్ ని అభినందిస్తూ మూవీ పై తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వెళ్తుంటే, రామ్ చరణ్ రీసెంట్ గా ఒక పోస్ట్ వేశారు. “డియర్ సిద్ధూ నీ అద్భుతమైన సక్సెస్ చూసి చాలా గర్వంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్, మాలిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్స్, చిత్ర నిర్మాతలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు” అంటూ ట్వీట్ చేసారు. ఇక ఈ ట్వీట్ కి అనుపమ రియాక్ట్ అవుతూ.. “థాంక్యూ రామ్ చరణ్ గారు” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Pushpa 2: పుష్ప2 పై అలాంటి పోస్ట్ చేసిన సురేష్ రైనా.. నెట్టింట పోస్ట్ వైరల్!

  Last Updated: 07 Apr 2024, 10:38 AM IST