Ram Charan Dance: గ్లోబల్ స్టార్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లతో (Ram Charan Dance) బిజీగా ఉన్నారు. డిసెంబర్ 21 నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ అదే ఊపులో మూవీ విడుదల వరకు కొనసాగించాలని చూస్తోంది. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ మొత్తం డల్లాస్‌లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా జనవరి 10, 2025న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్లుగా అంజలి, కియరా అద్వానీ, కీలక పాత్రల్లో ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటించారు.
అయితే డల్లాస్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్‌లోని రా మచ్చా మచ్చా రా సాంగ్‌కు చరణ్, ఎస్‌జే సూర్య, థమన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ పాటకు చరణ్ కొన్ని సిగ్నచేర్ స్టెప్స్ వేశారు. అభిమానులు సైతం సందడి చేస్తున్నారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: CM Chandrababu: భారీ సెక్యూరిటీ, బందోబస్తు హడావుడికి దూరంగా సీఎం చంద్రబాబు
డల్లాస్ లో రామ్ చరణ్ డాన్స్#ramcharan #gamechanger #dallas pic.twitter.com/tfyLgDNi5S
— Gopichand (@GThanuru) December 22, 2024
రాజమౌళి మూవీ తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న సినిమా కావటంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ఫొటోలు ఇప్పటికే సినిమాపై క్రేజ్‌ను పెంచుతున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న ఏపీలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీని దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌లో ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ఆర్‌సీ 16 మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తైనట్లు దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఓ ఈవెంట్‌లో చెప్పారు.