Ram Charan Game Changer: రామ్ చరణ్-శంకర్ మూవీ టైటిల్ ఇదే!

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామ్ చరణ్, శంకర్ మూవీ టైటిల్ కొద్దిసేపటి క్రితమే ఫిక్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర క్రియేషన్స్ ఆర్‌సి 15కి “గేమ్ ఛేంజర్” అనే టైటిల్‌ను విడుదల చేసింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్-ఇండియాగా రూపుదిద్దుకోబోతోంది. ఇక ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రేస్ ను మరింత పెంచేలా ఉండబోతోందని టాక్. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదల కానుంది. ఇది చరణ్ పుట్టినరోజును అతని అభిమానులకు ఆనందాన్నివ్వబోతోంది.

సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) సోమవారం 39వ ఏట అడుగుపెట్టారు. 27 మార్చి 1985న జన్మించిన రామ్ చరణ్ తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. చిరుత, మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తన సత్తా ఏంటో చాటిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక చెర్రీ పుట్టినరోజుకు ముందు అతని సహనటి కియారా అద్వానీ, దర్శకుడు ఎస్ శంకర్‌తో సహా మొత్తం స్టార్ కాస్ట్ రామ్ చరణ్ ప్రీ-బర్త్‌డేని ఘనంగా నిర్వహించారు. ఆర్సీ 15 సెట్స్‌లో రామ్ చరణ్ కేక్ కట్ చేశారు. చిత్ర యూనిట్ రామ్ చరణ్ పై గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఈ వేడుకలో రామ్ చరణ్ నీలిరంగు చొక్కా, ప్యాంటు, సన్ గ్లాసెస్ ధరించి కనిపించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Hyderabad Pubs: పబ్ గుప్పిట్లో యూత్.. అమ్మాయిల కోసం సీక్రెట్ రూమ్స్!

  Last Updated: 27 Mar 2023, 11:26 AM IST