Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ రోజు దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆయన చేతిలో క్రికెట్ బాల్ తిప్పుతూ, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు ‘రామ్ బుజ్జి’గా మేకర్స్ ప్రకటించారు. ఈ పాత్ర మాస్‌లోకి వెళ్లేలా పవర్‌ఫుల్ గా ఉండనుందని సమాచారం.
‘మిర్జాపూర్’ సిరీస్‌లో మున్నా భాయ్‌గా ఆకట్టుకున్న దివ్యేందు శర్మ, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించబోతున్నారు. ఇప్పటికే ఆయన నటనకు ఉత్తరాది ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండగా, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కనిపించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్‌లో ఉత్కంఠను పెంచుతోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
‘పెద్ది’ సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించగా, దివ్యేందు శర్మ చేరికతో మరింత హైప్ ఏర్పడింది.
Health : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ అలవాటు చేసుకోండి!