Site icon HashtagU Telugu

Game Changer : వినాయక చవితి స్పెషల్ గేమ్ ఛేంజర్ అప్డేట్.. కొత్త పోస్టర్ అదిరింది..

Ram Charan Dance

Ram Charan Dance

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు ని తిడుతూ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు ఫ్యాన్స్. సినిమా మాత్రం క్రిస్మస్ కి వస్తుందని చెప్పినా ఇప్పటివరకు ఒక్క పాట, ఒక్క పోస్టర్ తప్ప ఇంకెలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన హడావిడికి నిర్మాణ సంస్థ నేడు వినాయకచవితి రోజున గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చింది.

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ఒక సాంగ్ లోనిది అని తెలుస్తుంది. రామ్ చరణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సెప్టెంబర్ లో సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తామని కూడా అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోస్టర్ లో రామ్ చరణ్ తలకు ఎర్ర టవల్ కట్టుకోవడంతో బాబాయ్ పవన్ కళ్యాణ్ ని గుర్తుచేస్తున్నాడని పలువురు అంటున్నారు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి వినాయకచవితి రోజు గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక రెండో సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

Also Read : Nithiin Welcomed His First Child : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..