Site icon HashtagU Telugu

Ram Charan : ఆంధ్రాలో ఉన్నానా? లేక అమెరికాలో ఉన్నానా? అమెరికాలో ఫ్యాన్స్ ని చూసి చరణ్ షాక్..

Ram Charan Interesting Comments in America Game Changer Promotions

Ram Charan

Ram Charan : అమెరికాలో ఇటీవల తెలుగువాళ్లు ఎక్కువయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ మన తెలుగు సినిమాలకు మార్కెట్ కూడా పెరిగింది. తెలుగు నిర్మాతలు, హీరోలు అక్కడ కలెక్షన్స్ బాగా వస్తుండటంతో అటు వైపు ఫోకస్ చేస్తున్నారు. దిల్ రాజు ఓ అడుగు ముందుకేసి ఏకంగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలోనే ప్లాన్ చేసారు. నేడు అమెరికాలోని టెక్సాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

అయితే ఈవెంట్ కు ముందే చరణ్ నిన్న అక్కడ ఫ్యాన్స్ తో కలిసి మాట్లాడారు. ఈ ఫ్యాన్స్ మీట్ కు భారీగా అభిమానులు, అమెరికాలోని తెలుగు ప్రజలు వచ్చారు. చరణ్ ని ఎయిర్పోర్ట్ వద్ద ఆహ్వానం పలకడానికి కూడా భారీగా అభిమానులు వచ్చారు. ఇదంతా చూసి చరణ్ షాక్ అయ్యారు. ఇక నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీగా జనాలు వచ్చారు. కాసేపట్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది.

నిన్న ఫ్యాన్స్ మీట్ లో చరణ్ మాట్లాడుతూ.. డల్లాస్ లో ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు, ఇక్కడికి వచ్చిన జనాల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది. నేను అమెరికాలో ఉన్నానా లేక ఆంద్ర, తెలంగాణలో ఉన్నానా అని ఆశ్చర్యపోతున్నాను. నా మీద ప్రేమతో మీరంతా ఇక్కడికి వచ్చి మీ ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఓవర్సీస్ లోని మీరే సినిమాని ముందు చూస్తారు. అందుకే ప్రమోషన్స్ ఇక్కడి నుంచే మొదలుపెడుతున్నాం అని అన్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా అమెరికాలో ఎన్ని మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

 

Also Read : Pushpa-2 Controversy: పుష్ప‌-2 వివాదం.. మొద‌టి ముద్దాయి తెలంగాణ ప్రభుత్వ‌మే: సీపీఐ నారాయ‌ణ‌