Ram Charan and Priyanka: ప్రియాంక చోప్రాతో రామ్ చరణ్ చెట్టాపట్టాల్.. హాలీవుడ్ ఆఫర్స్ కోసమేనా!

రామ్ చరణ్, ప్రియాంక చోప్రాకు మధ్య మంచి స్నేహం ఉంది. ప్రియాంక చరిష్మాతో హాలీవుడ్ ఆఫర్స్ ను కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan And Priyanka

Ram Charan And Priyanka

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గ్లోబర్ స్టార్ అవతరించబోతున్నాడా? త్వరలోనే చరణ్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? అంటే అవుననే చెప్పక తప్పదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో హాలీవుడ్ యాక్టర్స్, డైరెక్టర్స్ నుంచి కలుసుకున్న చరణ్ మరోసారి హాలీవుడ్ ను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలనే హాలీవుడ్ డైరెక్టర్స్ రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా తీయబోతున్నారనే వార్తలు కూడా హల్ చల్ చేశారు. చరణ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు.

అయితే రామ్ చరణ్ హాలీవుడ్‌ (Hollywood)లో తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. తన హిందీ తొలి “జంజీర్”లో నటించిన ప్రియాంక చోప్రా సహాయం తీసుకున్నాడు. వీరి స్నేహం రామ్ చరణ్‌కి హాలీవుడ్‌లో మరింత గుర్తింపు తెచ్చేందుకు బాగా ఉపయోగపడుతుంది. ప్రియాంక చోప్రాకు హాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే యూఎస్ లో ఉన్న ప్రియాంక రామ్ చరణ్, RRR టీమ్‌తో కలిసి సందడి చేస్తోంది. ప్రియాంక ద్వారా హాలీవుడ్ అవకాశాలను దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చరణ్ ప్రియాంకతో కలిసి ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నాడట.

రాజమౌళి, రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా USA  లో ఉన్న విషయం తెలిసిందే. “నాటు నాటు” పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ టీం ఆనందంలో ఉంది. ఒకవేళ ఆస్కార్ గెలిస్తే గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి అవార్డును అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ ని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వచ్చాయి.

Also Read: Balakrishna Fan: బాలయ్య ప్లీజ్ రావయ్యా: బాలకృష్ణ వస్తేనే పెళ్లి, లేదంటే క్యాన్సిల్!

  Last Updated: 11 Mar 2023, 03:11 PM IST