Site icon HashtagU Telugu

Game Changer : దీపావళికి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఫిక్స్.. తమన్ ట్వీట్ తో క్లారిటీ..

Game Changer Trailer

Game Changer Trailer

Game Changer : శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా గేమ్ ఛేంజర్. మూడేళ్ళ నుంచి సాగుతున్న ఈ సినిమా నుంచి గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల అయి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించాయి. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేస్తామని ఇటీవల దసరా నాడు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ నుంచి ఫ్యాన్స్ టీజర్ అడుగుతుండగా ఇవాళ తమన్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసారు. గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ దీపావళికి రిలీజ్ కాబోతుంది. తమన్ తన ఫోటో ఒకటి షేర్ చేసి గేమ్ ఛేంజర్ టీజర్ మీదే వర్క్ చేస్తున్నాను అంటూ ఫైర్ క్రాకర్స్ సింబల్స్ పెట్టాడు. ఇదే ట్వీట్ ని గేమ్ ఛేంజర్ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి క్రాకర్స్ పేల్చడానికి సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేసారు.

దీంతో గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ దీపావళికి రిలీజ్ కాబోతుందని క్లారిటీ వచ్చేసింది. అంటే అక్టోబర్ 31న గేమ్ ఛేంజర్ టీజర్ రానుంది. ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో SJ సూర్య విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, కియారా అద్వానీ, నవీన్ చంద్ర, అంజలి, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్నారు.

 

Also Read : Renu Desai : మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టిన రేణు దేశాయ్.. ఏ సినిమా కోసమో..