Site icon HashtagU Telugu

Ram Charan New Look : రామ్ చరణ్ కూడా గడ్డం పెంచేస్తున్నాడే..!!

Charan New Look

Charan New Look

ఒకప్పుడు హీరోలు సినిమాల్లో గడ్డం లుక్ (Beard Look) లో కనిపిస్తే ఆ సినిమాలు ప్లాప్ అవుతాయనే సెంటిమెంట్ ఉండేది..కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కు బ్రేక్ ఇస్తున్నారు దర్శకులు. కథలో దమ్ము ఉండాలి..కానీ గడ్డం సెంటిమెంట్ అవసరం లేదని రుజువు చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలంతా కూడా గడ్డం లుక్ లో తమ కొత్త ప్రాజెక్ట్ లలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు (Mahesh Babu Beard look)..రాజమౌళి (Rajamouli) మూవీ కోసం భారీగా గడ్డం పెంచేసాడు. గత కొద్దీ రోజులుగా గడ్డం పెంచే పనిలో ఉన్న మహేష్..బయట కూడా అదే లుక్ లో కనిపిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పటి వరకు క్లీన్ షేవ్ లో కనిపిస్తూ ఉండే మహేష్..ఇప్పుడు భారీ గడ్డం తో కనిపిస్తుండడం తో అభిమానులు సూపర్ స్టార్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జనవరి లో ఈ మూవీ సెట్స్ పైకి రాబోతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాటలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా పయనిస్తున్నాడు. తన కొత్త సినిమా RC16 కోసం చరణ్ గడ్డం (Charan Beard look) పెంచుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన వినాయక్ బర్త్ డే సందర్బంగా ఆయనకు విషెష్ అందజేసినందుకు వచ్చాడు. ఈ సందర్బంగా ఆయన గడ్డం తో కనిపించేసరికి అభిమానులంతా బుచ్చిబాబు (Director Buchhibabu) సినిమా కోసమే ఇలా గడ్డం పెంచుతున్నట్లు ఉందని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో ‘రంగస్థలం’ మూవీ లో కూడా చరణ్ గడ్డం తో కనిపించి హిట్ కొట్టాడు..ఇప్పుడు కూడా అలాగే హిట్ కొట్టబోతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. జనవరి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం.

Read Also : Naga Chaitanya Twitter Account : నాగ చైతన్య కు మరో షాక్ ..?