Site icon HashtagU Telugu

Ram Charan : బ్రహ్మానందం ఇంట్లో పెద్ది సందడి

Charan Brhami

Charan Brhami

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కుటుంబాల మధ్య ఉన్న మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం వారి వారసుల మధ్య కూడా కొనసాగుతోంది . తాజాగా రామ్ చరణ్ (Ram Charan), ఆయన సతీమణి ఉపాసన బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. అక్కడ బ్రహ్మానందం కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులు రామ్ చరణ్, ఉపాసనలకు శ్రీ వేంకటేశ్వరుని విగ్రహాన్ని బహూకరించారు.

Kavitha : బిఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కవిత

చరణ్ ..బ్రహ్మి ఇంటికి వెళ్ళడానికి ప్రధాన కారణం, బ్రహ్మానందం రెండవ కుమారుడు సిద్ధార్థ్ ఇటీవల తండ్రి కావడం. సిద్ధార్థ్ సతీమణికి పండంటి బిడ్డ జన్మించింది. ఆ చిన్నారిని చూడటానికి, బ్రహ్మానందం కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పడానికి రామ్ చరణ్, ఉపాసనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందడితో రెండు కుటుంబాల మధ్య బంధం మరింత బలపడిందని స్పష్టమవుతోంది. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం, కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇలాంటి సంఘటనల ద్వారా మరింత బలోపేతం అవుతున్నాయి. ఒకరి సంతోషంలో ఒకరు పాలుపంచుకోవడం, మంచి చెడుల్లో తోడుగా ఉండటం అనేది ఈ తరహా సెలబ్రిటీల జీవితాల్లో మనం చూస్తున్న ఒక సానుకూల అంశం. ఈ సందడి రెండు కుటుంబాలకు ఆనందాన్ని పంచిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం రామ్ చరణ్ “పెద్ది”తో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.