Ram Charan : చిన్ననాటి స్నేహితుడు, ప్రభాస్ పార్ట్నర్ తో కలిసి రామ్ చరణ్ కొత్త నిర్మాణ సంస్థ.. వాళ్లకు ఛాన్సులు ఇవ్వడానికే..

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ సంస్థ ఉండగానే రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ప్రభాస్ UV క్రియేష‌న్స్‌లో ఒక పార్ట్నర్ అయిన త‌న చిన్ననాటి స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు క‌లిపారు చరణ్.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 09:00 PM IST

RRRతో వ‌ర‌ల్డ్ వైడ్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan). ఆ తర్వాత సినిమాలను కూడా లైన్లో పెడుతున్నారు చరణ్. ఇక చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి(Chiranjeevi) నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహ రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భాగమైంది .

ఈ నిర్మాణ సంస్థ ఉండగానే రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ప్రభాస్ UV క్రియేష‌న్స్‌లో ఒక పార్ట్నర్ అయిన త‌న చిన్ననాటి స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు క‌లిపారు చరణ్. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ కలిసి ‘వి మెగా పిక్చర్స్’ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తీస్తూ, యంగ్ ట్యాలెంట్ ని ప్రోత్సహిస్తామని తెలిపారు చరణ్, విక్రమ్.

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ తో విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌క‌త‌తో సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి ఓ స‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ.. ఈ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టం అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో క‌లిసి “వి మెగా పిక్చ‌ర్స్” ప‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ హ‌ద్దులు చెరిపేయ‌ట‌మే మా ల‌క్ష్యం అని అన్నారు. మరి ఈ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.

 

Also Read : Ram Charan: ఆ మ్యాజిక్ జపాన్‌లోనే జరిగింది, ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ కామెంట్స్!