మెగా అభిమానుల (Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), భార్య ఉపాసన (Upasana) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆర్ఆర్ఆర్ నటుడు తాము మొదటి బిడ్డను ఆశిస్తున్నట్టు సోమవారం ప్రకటించాడు. ఈ మేరకు రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కొణిదెల, ఉపాసన తల్లిదండ్రులు శోభన, అనిల్ కామినేని ట్విట్టర్ లో స్పష్టం చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి (Megastar chiru) ‘‘తాను తాతను కాబోతున్నానంటూ’’ చేసిన ట్వీట్ టాలీవుడ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. రాంచరణ్-ఉపాసన పెళ్లై చాలా కాలం అవుతున్నా, పిల్లల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పిల్లలు ఎప్పుడు? అనే ప్రశ్నకు ఇటు ఉపాసన గానీ, అటు రాంచరణ్ గానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. గతంలో ఓసారి పిల్లల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన.. సరైన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని తెలిపారు.
రాంచరణ్- ఉపాసన (Ram charan and Upasana) 2012 లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మినివ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కెరీర్ కోసమే ఈ జంట పిల్లలకు దూరంగా ఉన్నట్టు చాలాసార్లు పలు ఇంటర్వ్యూలో చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా తేల్చి చెప్పారు. కానీ కొన్ని వెబ్ సైట్స్ మాత్రం వక్రీకరించి రాశాయి. గతంలో సద్గురు కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పడంతో అటు మెగా ఫ్యామిలీ, అభిమానులు (Mega Fans) ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Shahrukh and Deepika Romance: రొమాన్స్ తో రెచ్చిపోయిన షారుఖ్, దీపికా.. హీటెక్కిస్తోన్న‘బేషరమ్’ సాంగ్
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022