Site icon HashtagU Telugu

Rakul Preet Singh : కొండా సురేఖ కు రకుల్ ప్రీతీ సింగ్ వార్నింగ్..

Rakul Warning To Surekha

Rakul Warning To Surekha

కొండా సురేఖ (Konda Surekha) పేరు నిన్నటి నుండి సోషల్ మీడియా , నేషనల్ చానెల్స్ లలో కూడా మారుమోగిపోతుంది. కేటీఆర్ (KTR) ఫై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నాగార్జున (Nagarjuna) , సమంత (Samanta) , రకుల్ ప్రీతి (Rakul Preet Singh) సింగ్ పేర్లను తీసుకొచ్చి పెద్ద రాద్దాంతమే చేసింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ తో పాటు రాజకీయేతర పార్టీల నేతలు సైతం సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన మాటలను వెనక్కు తీసుకున్నప్పటికీ..బాధితులు మాత్రం తమ వార్ ను కొనసాగిస్తామని చెపుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేయగా..నాగార్జున నాంపల్లి కోర్ట్ లో సురేఖ ఫై పరువు నష్టం దావా చేసారు. ఇటు రకుల్ సైతం సురేఖ కామెంట్స్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని తెలిపింది. తాను పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకిని అని.. రాజకీయ లబ్ది కోసం తన పేరును వాడితే అస్సలు బాగోదని ఫైర్ అయ్యింది.

” తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత మరియు వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేసాను. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉన్నాను. ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు పుకార్లు మా సోదరి మహిళలపై వ్యాప్తి చెందడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ దీన్ని చేస్తోంది.

గౌరవం కోసం.. మేము మౌనంగా ఉంటున్నాం.. కానీ, అది మా బలహీనత అని తప్పుగా భావించవద్దు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. ఏ వ్యక్తి/రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయ మైలేజీని పొందే మార్గంలో నా పేరును హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. కళాకారులు సృజనాత్మక వ్యక్తులను రాజకీయ స్లగ్ ఫెస్ట్ నుండి దూరంగా ఉంచాలి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టడం ద్వారా హెడ్ లైన్స్ లో వచ్చేందుకు ఉపయోగించకూడదు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Read Also : Fasting Tips : దేవీ నవరాత్రులలో ఉపవాసం పాటించడానికి సరైన మార్గం ఏమిటి..?