Jailer Box Office: రజినీకాంత్ బాక్సాఫీస్ ఊచకోత, 300 కోట్లతో జైలర్ సరికొత్త రికార్డ్

సాదాసీదా కథ అయినా రజినీ చేతిలో పడిందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే.

  • Written By:
  • Updated On - August 14, 2023 / 05:20 PM IST

సాదాసీదా కథ అయినా రజినీ చేతిలో పడిందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. తన మేనరిజమ్స్, స్టైల్స్, ఫాలోయింగ్స్ తో సినిమాకు హిట్ టాక్ తీసుకురాగలరు. భారీ అంచనాల నడుమ విడుదలైన జైలర్ అన్ని వెర్షన్లు కలిపి  301 కోట్ల గ్రాస్ దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. తమిళం 82 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 34 కోట్లు, కర్ణాటక 32 కోట్లు, కేరళ 23 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా 4 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ 125 కోట్లు ఇలా ఎక్కడ చూసినా అరాచకానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.

కేవలం ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే 12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కి ఆల్రెడీ 6 కోట్ల దాకా లాభం వచ్చేసింది. కొన్న బయ్యర్లందరూ లాభాల్లోకి వెళ్లిపోయారు. ఇంకా సెకండ్ వీక్ రాలేదు. రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ హాలిడే ఉంది కాబట్టి ఫిగర్లు ఊహించిన దానికన్నా భారీగా ఉండబోతున్నాయి. దెబ్బకు కోలీవుడ్ లో విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, తునివు, వరిసు పేరు మీద ఉన్న రికార్డులన్నీ చెల్లాచెదురైపోయాయి. రజని మాత్రం ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు.

జైలర్ మూవీ ఊహించనివిధంగా సక్సెస్ కావడంతో సీనియర్ హీరో కమల్ హాసన్ సైతం రియాక్ట్ అయ్యారు. వెల్ డన్ రజినీ అంటూ జైలర్ మూవీపై ప్రశంసలు కురిపించాడు. ఇక రజనీ దెబ్బకు బోళా శంకర్ బోల్తా కొట్టడంతో జైలర్ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఇక భోళా శంకర్ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోతుందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ మూవీ ఇప్పటివరకు పెట్టిన డబ్బులో సగం కూడా రాబట్టలేకపోయిందని టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

Also Read: D51: క్రేజీ కాంబినేషన్.. ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో నేషనల్ క్రష్ రష్మిక!