కెరీర్ ఆరంభంలో అవకాశాలు రాక, చేతిలో డబ్బుల్లేక 3 నెలలు అన్నం తినలేదని, ఒక దశలో వేషాలు రాకపోవడంతో ఆత్మహత్య (suicide) చేసుకోవాలనుకున్నా. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళితే డబ్బింగ్ అవకాశం వచ్చింది. దీంతో నా దశ తిరిగింది’ అని నటకీరిటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అన్నారు.
రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు. ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.
నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే కెరియర్ మొదట్లో అవకాశాలు రాకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.
కెరీర్ ఆరంభంలో అవకాశాలు రాక, చేతిలో డబ్బుల్లేక 3 నెలలు అన్నం తినలేదని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. సినిమాల్లోకి వెళ్తా అనడంతో నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావొద్దన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళితే డబ్బింగ్ అవకాశం వచ్చింది. దీంతో నా దశ తిరిగింది’ అని తెలిపారు.
Read Also : Varanasi Railway Station : వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం