Rajendra Prasad : సినీ పరిశ్రమలో హీరోల్లో కూడా చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి కూడా సినీ పరిశ్రమలో, బయట అనేక మంది మిత్రులు ఉన్నారు. చాలా మందికి సినీ పరిశ్రమలో చిరంజీవి – నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. అయితే చిరంజీవి – రాజేంద్రప్రసాద్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. గతంలో రాజేంద్రప్రసాద్, చిరు ఇద్దరూ ఈ విషయంపై మాట్లాడారు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మరోసారి మాట్లాడారు. రాజేంద్రప్రసాద్.. ఇండస్ట్రీలో నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ చిరంజీవి. ఇది ఎప్పటికి మారదు. ఫిలిం స్కూల్ లో చెన్నైలో చదివేటప్పుడు చిరంజీవి నా జూనియర్. చిరంజీవికి నేను మైమ్ యాక్టింగ్ క్లాసులు కూడా చెప్పాను. మేమిద్దరం అప్పట్నుంచే మంచి స్నేహితులం. అప్పుడప్పుడు సరదాగా చిరంజీవి నిన్ను మాత్రం మార్చలేనురా అంటాడు అని వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలిపాడు.