యాంకర్ సుమ కనకాల(Suma Kanakala).. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితమే. గత 20 ఏళ్లుగా తన యాంకరింగ్ తో ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటే టీవీ షో చేస్తున్నా సినిమా ఈవెంట్స్, యూట్యూబ్ తో బిజీబిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులతో అలరిస్తుంది సుమ. ఇటీవలే తన కొడుకు రోషన్ ని హీరోగా కూడా లాంచ్ చేసింది.
అయితే సుమ పోస్ట్ చేసే ఫోటోలు అన్ని కూడా పద్దతిగా ఉంటాయి. మిగతా యాంకర్స్ కి సుమకి ఉన్న తేడాల్లో మొదటిది పద్ధతే. చీరలు, పంజాబీ డ్రెస్సుల్లోనే సుమ ఫోటోషూట్స్ చేసి పోస్ట్ చేస్తుంటుంది. కానీ ఇటీవల సుమ మోడరన్ లుక్స్ లో ఫోటోషూట్ చేసింది. జీన్స్, హోల్స్ ఉన్న టీ షర్ట్ వేసి స్టైల్ గా కళ్ళజోడు పెట్టి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు పోస్ట్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సుమక్కలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకున్నారు.
తాజాగా ఈ మోడరన్ ఫోటోషూట్ చేసినప్పటి వీడియో పోస్ట్ చేసింది. ఈ ఫోటోషూట్ చేసినప్పుడు భర్త రాజీవ్ కనకాల కూడా అక్కడే ఉన్నాడు. దీంతో సుమ చేస్తున్న ఈ మోడరన్ ఫోటోషూట్ చూసి రాజీవ్ కనకాల(Rajeev Kanakala).. వామ్మో, వాయ్యో, బాబోయ్.. నేను చూడలేకపోతున్న ఈ ఘోరం అంటూ చిత్ర విచిత్రంగా రియాక్షన్స్ ఇచ్చారు. సుమ ఈ రియాక్షన్స్ తో వీడియో పోస్ట్ చేయగా ఇది వైరల్ గా మారింది. దీంతో భార్యలు ఇలా చేస్తే భర్తల రియాక్షన్ ఇలాగే ఉంటుందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సుమక్క మాత్రం ఇలా మోడరన్ గా కంటే కూడా పద్దతిగా ఉంటేనే బాగుంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Mahesh Babu : అయిదు సినిమాలతో ఆ రికార్డ్ సెట్ చేసిన ఏకైక హీరో మహేష్.. ఏంటా రికార్డ్?